ఎన్టీఆర్‌: బతికున్నప్పుడు చంపేసి.. ఇప్పుడు గౌరవమా?

Chakravarthi Kalyan
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు వివాదం ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పేరు మార్చడాన్ని వైసీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల విమర్శలపై మాటల దాడి చేస్తున్నారు. ఎన్టీఆర్ బ్రతికుండగా ఆయనను మానసిక క్షోభ కు గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు యూనివర్సిటీ పేరు మార్చే సరికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫి శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అంటున్నారు. 


పేదవారికి కార్పొరేట్ వైద్యం,విద్య అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కే దక్కిందని మంత్రి అన్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో 3 వ విడత వైయస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నరసాపురం మండలంలోని 3 వేల 850 మంది లబ్ధిదారులకు రూ. 7.23కోట్ల రూపాయిల లబ్ది చేకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: