విశాఖను వ్యభిచార రాజధాని చేస్తున్నారా?

Chakravarthi Kalyan
విశాఖను ఏపీ రాజధాని చేయాలని సీఎం జగన్ కలలు కంటున్నారు. అందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు కూడా పెట్టారు. కానీ అనేక కారణాలతో ఆ బిల్లు అమలుకు నోచుకోలేదు. అయితే.. ఏపీకి రాజధాని సంగతేమో కానీ.. విశాఖ ఏపీకి వ్యభిచార రాజధానిగా మారుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విశాఖలో అక్రమంగా నడుస్తున్న మసాజ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం విశాఖలోనే 200కి పైగా మసాజ్ సెంటర్లు అక్రమంగా నడుస్తున్నాయని వీరు చెబుతున్నారు. విశాఖను రాజధాని చేస్తానన్న జగన్.. మసాజ్ సెంటర్లను తీసుకువచ్చారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఈ మసాజ్ సెంటర్లపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: