మాజీ నక్సలైట్ నరసింహారెడ్డికి యావజ్జీవ ఖైదు

Chakravarthi Kalyan
మాజీ నక్సలైట్ చదిపిరాల నరసింహారెడ్డి అలియాస్ రాజశేఖర్ కు జిల్లా కోర్టు యావజీవ కారాగార శిక్ష, రూ.10 వేలు  జరిమానా విధించింది. 2004 ఫిబ్రవరి 21న జరిగిన రామాపురం మండల జడ్పిటిసి సభ్యుడు సిద్దయ్య, వాసుదేవ రెడ్డిల హత్య కేసులో మాజీ నక్సలైట్ చదిపిరాల నరసింహారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో  మాజీ నక్సలైట్ చదిపిరాల నరసింహారెడ్డి కడప- చిత్తూరు ఉమ్మడి జిల్లాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు.2004 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన టిడిపి విజయభేరి సభకు నేతలు వెళ్ళద్దని బహుదాదళం హెచ్చరించింది.
కర్నూలు -చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం పొత్తుకూరుపల్లి క్రాస్ రోడ్డు వద్ద స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఉన్న సిద్దయ్య, వాసుదేవ రెడ్డిలను రాత్రి 9.30 గంటల సమయంలో నక్సల్స్ హత్య చేశారు. అప్పట్లో నరసింహారెడ్డి మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 2005 తర్వాత జన స్రవంతిలో మాజీ నక్సలైట్ చదిపిరాల నరసింహారెడ్డి కలిసిపోయారు. ఈ కేసు 18 ఏళ్లుగా విచారణ జరిగింది. బుధవారం  ఇరువర్గాల వాదనను విన్న జిల్లా ఐదవ కోర్టు న్యాయమూర్తి ఇంతియాజ్ భాషా.. నరసింహారెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార  శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: