సీపీఎస్‌ అంశం.. జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Chakravarthi Kalyan
సీపీఎస్ అంశాన్ని పరిష్కరించేందుకు సీఎం జగన్ మరో కొత్త ఆలోచన చేస్తున్నారు. 2004 కంటే ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఎంపికైన ఉద్యోగులకు పాతపెన్షన్ అమలు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా  ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబరు ఒకటి నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే  ఆర్ధిక శాఖ కోరింది. ఈనెల 14న సచివాలయంలో జరిగే సమావేశానికి ఈ వివరాలతో హాజరుకావాలని హెచ్ఓడి కార్యాలయాలు, ఆయా శాఖల కార్యదర్శులకు లేఖలు వెళ్లాయి.

అయితే.. 2004 సెప్టెంబరు 1 కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6510గా ఉన్నట్టు ఇప్పటికే ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపింది. హోంశాఖతో పాటు ఇతర విభాగాల్లోనూ 2004 కంటే ముందుగా నోటిఫికేషన్ విడుదలై ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విధుల్లో చేరిన వారి వివరాలను సేకరిస్తారు. అయితే.. ఈ ప్రక్రియలో 2003 డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్ 2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ది కలిగే అవకాశం ఉంది. మరి కొందరికే అవకాశం కల్పిస్తే మిగిలిన ఉద్యోగులు ఊరుకుంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: