గుడ్‌న్యూస్‌.. ఆ సమస్యకు ఉచితంగా ఆపరేషన్లు?

Chakravarthi Kalyan
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. బెంగ‌ళూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి, బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్లాస్టిక్ స‌ర్జన్ డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలో తొలిరోజు ఐదుగురికి విజ‌య‌వంతంగా శ‌స్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడు నెల‌ల వ‌య‌సు దాటిన ఏ చిన్నారికైనా గ్రహ‌ణ‌ మొర్రి శ‌స్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు బర్డ్ అధికారులు తెలిపారు.
ఉచితంగా శ‌స్త్ర చికిత్సలు నిర్వహించ‌డమే కాదు.. ర‌వాణా ఛార్జీలు కూడా ఇస్తారు. గ్రహ‌ణ‌మొర్రి బాధితుల‌కు జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్యల వ‌ల్ల ఇత‌ర వ్యాధులు కూడా ఉండే అవ‌కాశ‌ముంటుంది.  శ‌స్త్రచికిత్సల స‌మ‌యంలో జ‌రిపే ప‌రీక్షల్లో ఇలాంటి వ్యాధులు గుర్తిస్తే వాటికి కూడా ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు. గ్రహ‌ణ‌మొర్రి శ‌స్త్రచికిత్సల కోసం ఈ శుక్రవారం వ‌ర‌కు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7337318107 నంబ‌రుకు ఫోన్ చేసి ముంద‌స్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ‌కార్డుతో అవ‌స‌రం లేదు. పేద, ధ‌నిక తేడా లేకుండా అవ‌స‌ర‌మైన వారంద‌రికీ ఉచితంగా శ‌స్త్రచికిత్సలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: