ఆర్టీసీ గుడ్ న్యూస్.. మరో 2 నెలల్లో..?

Chakravarthi Kalyan
ఏపీఎస్‌ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.. మరో రెండు నెలల్లో 100 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి వివరించారు. తిరుమల తిరుపతికి ఎక్కువ బస్సులను కేటాయించారు. తిరుమల నుంచి కడప, నెల్లూరు, మదనపల్లికి కూడా ఎలక్ట్రికల్ నాన్ స్టాప్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. డపలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 23 ఆర్టిసి అద్దె బస్సులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతే పరమావధిగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

త్వరలో మరిన్ని ఆర్టీసీ బస్సులు కూడా రానున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు. తిరుపతిలో అత్యాధునికంగా బస్టాండ్ నిర్మాణం ప్రారంభించామన్నారు. అదే తరహాలో కడపలో కూడా ఇప్పుడున్న బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కడపలో 12 కోట్లతో ఆర్టీసీ గ్యారేజ్ నిర్మిస్తున్నారు. పులివెందులలో 36 కోట్ల రూపాయలతో కొత్తగా బస్టాండ్ నిర్మించామని డిసెంబర్లో ప్రారంభిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: