చంద్రబాబు అడ్డాలోకి జగన్.. ఎప్పుడంటే?

Chakravarthi Kalyan
కుప్పం..ఇది చంద్రబాబు అడ్డా.. ఈ నియోజక వర్గం నుంచి ఆయన వరసగా గెలుస్తూ వస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే.. ఈ సారి కుప్పం సీటుపై వైసీపీ కన్నేసింది.. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. అందుకే కుప్పంలో కార్యకలాపాలు పెంచింది. ఇక ఇప్పుడు సీఎం జగన్ త్వరలో కుప్పంలో పర్యటించబోతున్నారు.
సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 22న కుప్పంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ  వర్గాలు సమాచారం ఇచ్చాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ ఇప్పటికే ముఖ్యమంత్రి రాక సమాచారంతో హెలిప్యాడ్‌ స్థలాలను కూడా పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 66 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: