రష్యాకు ఆ దేశం సాయం.. పసిగట్టిన అమెరికా నిఘా?

Chakravarthi Kalyan
రష్యాకు ఆయుధాల పరంగా ఉత్తర కొరియా సాయం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు కనిపెట్టాయి. ఉత్తర కొరియా నుంచి భారీ మొత్తంలో రష్యా శతఘ్ని గుళ్లు, రాకెట్లను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈమేరకు ఓ నివేదిక రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధం కోసం రష్యా ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయబోతోందట. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారి చెప్పారు.

ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అమెరికా రష్యాపై కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల కారణంగా రష్యా సైన్యానికి ఆయుధాల సరఫరాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో రష్యా తన ఆయుధ అవసరాల కోసం ఉత్తర కొరియాను ఆశ్రయిస్తోందని అమెరికా భావిస్తోంది. ఉత్తర కొరియా నుంచి రష్యా అదనంగా సైనిక పరికరాలనూ కొనుగోలు చేయవచ్చని అమెరికా  అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: