ఆ ప్రశ్న అడిగితే.. తడబడిపోతున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో ఆడుకుంటారు.. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్న వేసినా చటుక్కున తప్పించుకుంటారు. అలాంటిది ఆయన ఇటీవల ఓ ప్రశ్న అడిగితే మాత్రం తడబడిపోతున్నారు. సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం చేరబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. కానీ.. ఇదే ప్రచారంపై చంద్రబాబు ప్రశ్నిస్తే మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు.

అంతే కాదు.. నేను కాదు.. దీనికి సమాధానం ప్రచారం చేసేవాళ్లే చెప్పాలని ఎదురుదాడి చేస్తున్నారు. తానైతే ఈ విషయంపై ఇప్పుడేం స్పందించనని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఆనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామంటున్న చంద్రబాబు... రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే ఇప్పుడు జగన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని అంటున్నారు తప్పా.. ఎన్డీఏలో చేరతారా.. చేరరా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: