గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ చార్జీలు తగ్గాయ్..?

Chakravarthi Kalyan
ఆర్టీసీ చార్జీలు పెరగడమే కానీ.. తగ్గడం చాలా అరుదు.. కానీ తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ.. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా చార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల చార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30 వరకు చార్జీలో తగ్గింపు అమల్లో ఉంటుందని తెలిపిన ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఏ రూట్లు, బస్సుల్లో చార్జీ ఎంత మేర తగ్గించాలనే విషయమై ఆర్ ఎం లకు నిర్ణయాధికారం ఇచ్చింది.
ఏసీ బస్సుల్లో చార్జీలు  తగ్గిస్తూ జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య తిరిగే ఏసీ బస్సుల్లో 10 శాతం  చార్జీ తగ్గించారు. అమరావతి, గరుడ, వెన్నెల ఎసీ బస్సు సర్వీసుల్లో చార్జీలో 10 శాతం తగ్గించారు. శుక్రవారం , ఆదివారాల్లో మినహా మిగిలి రోజుల్లో చార్జీ తగ్గిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే డాల్ఫిన్ క్రూయిజ్ లో 20 శాతం చార్జీ తగ్గించారు. విజయవాడ నుంచి  చెన్నై, బెంగళూరు వెళ్లే ఎసీ బస్సుల్లో 20 శాతం  చార్జీ తగ్గించారు. అమరావతి, వెన్నెల ఎసీ సర్వీసుల్లో శుక్ర, ఆది వారాల్లో మినహా మిగిలిన రోజుల్లో చార్జీలు తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: