వరద కష్టాల్లో పాక్‌.. అండగా అమెరికా?

Chakravarthi Kalyan
వరదల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ కు అమెరికా ఆపన్న హస్తం అందించింది. ఏకంగా 30 మిలియన్ డాలర్ల  ఆర్థిక సాయం చేయడానికి అమెరికా అంగీకరించింది. పాకిస్తాన్‌లో వరదల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వెయ్యికి మందికి పైగా వరదల కారణంగా మరణించారు. మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఈ వరదలు అశనిపాతంగా మారాయి. ప్రపంచ దేశాల సాయం అడుగుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఆదుకుంటూనంటూ ముందుకొచ్చింది.

పాక్ కు సహాయం అందిస్తామన్న దేశాల జాబితాలో  అమెరికా కూడా చేరింది. ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు ముప్పై మిలియన్ల డాలర్లను వినియోగించుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా సూచించింది. పాక్ లో వరదలు సృష్టించిన బీభత్సంపై అమెరికా పార్లమెంటులో చర్చ జరిగింది. పలువురు అమెరికన్లు ఈ జల ప్రళయంపై విచారం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో పాకిస్తాన్‌కు అండగా ఉంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: