కష్టాల్లో పాకిస్తాన్‌.. అండగా ఆ దేశాలు సాయం?

Chakravarthi Kalyan
వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్‌ దేశాన్ని ఆదుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. వరదల విపత్తు నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌ను ఆదుకోవాలంటూ ఆ దేశ  ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ఇప్పటికే అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటున్నారు. ఆయన విజ్ఞప్తికి అమెరికా, బ్రిటన్, దుబాయ్, చైనా వంటి దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

పాకిస్తాన్‌కు అత్యవసర సాయం అందిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. కెనడా, ఫ్రాన్స్ సహా పలుదేశాలు ఇప్పటికే సాయం అందిస్తున్నాయి కూడా.  పాక్‌లో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం చాలా బాధించిందని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అన్నారు. పాకిస్థాన్ ప్రజలకు అండగా నిలుస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ అన్నారు. మరోవైపు పాక్‌కు సహాయం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లో సహాయక చర్యల కోసం 2.6 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: