ఏపీకి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.6వేల 756 కోట్లు?

Chakravarthi Kalyan
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. ఏపికి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.  2014 జూన్ 2 తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ డిస్కం లు తెలంగాణకు 2017 జూన్ 10 తేదీ వరకూ విద్యుత్ సరఫరా చేశాయి. కానీ ఈ విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు ఇంత వరకూ నగదు చెల్లించలేదు.

ఈ అంశం కేంద్రం వద్ద ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. సీఎం డిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ బకాయిలు ఇప్పించాలని కోరుతున్నారు. మొత్తానికి ఇప్పుడు కేంద్రం స్పందించింది. 3441.78 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని.. దీనితో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా మరో 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. నెలరోజుల్లోగా ఈ మొత్తాన్ని ఏపి కి తెలంగాణ కట్టాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అనూప్ సింగ్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: