ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
వినాయకచవితికి బ్యాంకు ఉద్యోగులకు ఎన్ ఐ యాక్ట్ ప్రకారం ఈ నెల 31న సెలవు ప్రకటించాలంటూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చేసిన డిమాండ్ ఫలించింది. ఈనెల 31న బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఇస్తూ ఏపీ సర్కారు జీవో ఇచ్చింది. ఈ విషయంపై యూనియన్లు ఇప్పటికే  సీఎం జగన్,  చీఫ్ సెక్రటరీకి లేఖలు రాశాయి. అయినా నిన్నటి వరకూ సెలవుపై క్లారిటీ రానేలేదు. దీంతో దేశవ్యాప్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్దలతో ఘనంగా జరపుకుంటారని.. ఏపీలో మాత్రం సెలవు ఇవ్వడం లేదని బ్యాంకు ఉద్యోగులు బాధపడ్డారు.

అయితే.. నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులకు వినాయక చవితి రోజు సెలవు ప్రకటిస్తూ ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. ఆగస్టు 22 తేదీనే జీవో జారీ అయినా దానిని ప్రభుత్వం నిన్నటి వరకూ బయటపెట్టలేదు. దీంతో ఏపీలోని బ్యాంకులు సెలవుపై గందరగోళంలో ఉన్నాయి.  విమర్శలు రావడంతో ప్రభుత్వం హడావిడిగా జీవోను బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: