భూరాబందులు.. వృద్దాశ్రమాలనూ వదలరా?

Chakravarthi Kalyan
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ నగర పరిధిలో వృద్ధుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వైసీపీ కబ్జారాయుళ్లు వదలడం లేదని.. టీడీపి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు  ఆరోపిస్తున్నారు. ఈ భూమిని కొందరు ఆక్రమించుకుని విక్రయాల జరుపుతున్న వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.

ఈ మేరకు అయ్యన్నపాత్రుడు ఓ విడియో విడుదల చేశారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని కొంతమంది భు రాబందులు అన్యాయంగా ఆక్రమించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అంటున్నారు. దీనిపై స్ధానిక నేతలు జోక్యం చేసుకోవాలన్నారు. పరిశ్రమ ల శాఖ మంత్రిగా ఉన్న  అమర్ తన హయాంలో విశాఖ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. మరి అయ్యన్న విమర్శల్లో ఎంత వాస్తవం ఉందో.. అధికార పార్టీ నేతలకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: