చైనాను హడలెత్తించేలా తైవాన్‌ క్షిపణి విన్యాసాలు?

Chakravarthi Kalyan
చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికాకు చెందిన చట్టసభల ముఖ్యులు ఇటీవల తైవాన్‌లో పర్యటించినప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. తైవాన్‌ను ఇప్పటికీ చైనా తన అంతర్భాగంగానే చెబుతుంటుంది. తైవాన్ మాత్రం తాను స్వతంత్ర్య దేశంగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా తైవాన్‌ను గుర్తిస్తూ ఆ దేశంలో కీలక పర్యటనలు జరపడం చైనాకు కంటగింపుగా మారింది.
ఈ నేపథ్యంలో చైనా తరచూ తైవాన్‌ సమీపంలో సైనిక విన్యాసాలు చేస్తోంది. దీనికి ప్రతిగా తైవాన్‌ కూడా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. గగనతల రక్షణే లక్ష్యంగా దేశీయంగా తయారైన క్షిపణులతో తైవాన్‌ ఈ విన్యాసాలు నిర్వహించింది. చైనా ఇటీవల తైవాన్‌ను రెచ్చగొట్టేలా తైవాన్‌ భూభాగానికి అతి సమీపంలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలు చేసింది. చైనా బెదిరింపులకు భయపడేది లేదన్నట్టుగా తైవాన్‌ తాజాగా ఈ విన్యాసాలు నిర్వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: