ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్‌?

Chakravarthi Kalyan
ఆధార్‌ కార్డు.. ఇప్పుడు ఈ కార్డు లేకుండా ఏ సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. కానీ.. కొందరు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అవగాహన లోపం వల్ల ఆధార్‌ కార్డులు తీసుకోరు. అలాంటి విద్యార్థులకు ఇది చాలా గుడ్ న్యూస్.. విద్యార్థుల కోసం 23, 24 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థుల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆధార్‌ సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు ఏర్పాటుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థి కూడా ఆధార్‌ కార్డు తీసుకునేలా వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారికి తగిన విధంగా బాధ్యతలు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: