రిషి భార్య గురించిన ఈ ఇంట్రస్టింగ్‌ థింగ్స్ తెలుసా?

Chakravarthi Kalyan
రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న భారత సంతతి వ్యక్తి. ఆయన తన తాజా ఇంటర్వ్యూలో భార్య గురించిన అనేక ఇంట్రస్టింగ్స్ పంచుకున్నారు. రిషి సునాక్‌ భార్య అక్షత ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అన్న సంగతి తెలిసిందే కదా.  రిషి సునాక్‌ తల్లిదండ్రులు కూడా భారత సంతతి వారే.  రిషి సునాక్‌ సౌథాంప్టన్‌లో జన్మించారు.
రిషి సునాక్‌ తన భార్య అక్షతా మూర్తితో అనుబంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భార్య అక్షత కంటే తనకే క్రమశిక్షణ కాస్త ఎక్కువట. వారిద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులట. విజాతి ధ్రువాలే ఆకర్షించుకుంటాయి కాబట్టి తాము ఒక్కటై ఉండొచ్చంటున్నారు  రిషి సునాక్‌. సునాక్‌ వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకుంటారట. అక్షత మాత్రం చిందరవందరగా పడేస్తుంటుందట.  రిషి సునాక్‌కు క్రమశిక్షణ చాలా ఎక్కువట. అక్షతకు చాలా సమయ స్ఫూర్తి ఉందట.  రిషి సునాక్‌ ఇంట్లో వస్తువులన్నింటినీ చక్కగా సర్దుతారట. అక్షత మాత్రం దుస్తులు, బూట్లు ఎక్కడివక్కడ వదిలేస్తుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: