తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త?

Chakravarthi Kalyan
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవాలని తపించిపోయే భక్తి కోటికి కొదువ లేదు. అలాంటి శ్రీవారి భక్తులకు ఇది చక్కటి శుభవార్త అనే చెప్పాలి.. ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయబోతున్నామని తిరుపతి తిరుమల దేవస్థానము తెలిపింది. తిరుపతి తిరుమల దేవస్థానము యాజమాన్యం.. ఆగస్టు 1న ఉదయం 10 గం. కు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయబోతోందని ప్రకటించింది.
ఈ సారి 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్టు తిరుపతి తిరుమల దేవస్థానము  ప్రకటించింది. ఒక్కో టికెట్‌కు రూ.2,500 చెల్లించి బుక్‌ చేసుకునే సౌలభ్యం తిరుపతి తిరుమల దేవస్థానము  కల్పించింది. ఈ టికెట్‌ పొందిన వారికి.. మూడ్రోజులు స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం లభిస్తుందని ప్రకటించింది. అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి తిరుమల దేవస్థానములు సూచించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధం కండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: