తిరుపతిలో ఇప్పుడు జరగని పాపం లేదా?

Chakravarthi Kalyan
జగన్ సర్కారుపై సినీ నిర్మాత అశ్వినీదత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఇప్పుడు ఇప్పుడు జరగని పాపం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందని సినీ నిర్మాత అశ్వినీ దత్‌ సంచలన విమర్శలు చేశారు. తిరుపతిలో జరిగే   జరిగే అన్యాయాలను ఊహించలేమని మరీ సినీ నిర్మాత అశ్వినీ దత్‌ వ్యాఖ్యానించారు.
‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడిన సినీ నిర్మాత అశ్వినీ దత్‌  జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రావాలని.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని అశ్వినీ దత్ అన్నారు. అశ్వినీదత్‌ తెలుగు దేశం మద్దతు దారు అన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం తరపన ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. టీడీపీ నేతగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజమే అయినా.. తిరుపతి గురించి ఈ స్థాయిలో విమర్శించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: