విలీన మండలాలతో ప్రత్యేక జిల్లా.. చంద్రబాబు హామీ?

Chakravarthi Kalyan
ఏపీలోని విలీనమైన మండలాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. గోదావరి వరదల్లో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను పరామర్శించారు. ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగింది.
గూండాల గ్రామంలో వరద బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు.. ప్రజలు ట్రాక్ రికార్డు చూసి నేతల్ని ఎన్నుకోవాలన్నారు. దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారన్న చంద్రబాబు.. డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైందన్నారు.

5విలీన గ్రామాల సమస్య తాత్కాలికమేనని.. తెలుగుదేశం అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. విలీన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజల్ని మెప్పించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదన్న చంద్రబాబు.. పోలవరం ముంపు బాధితులకు రూ.10లక్షలు ఇస్తాననే తప్పుడు హామీ జగన్ రెడ్డి ఎందుకిచ్చారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: