శ్రీలంక అధ్యక్ష భవనంలో భారీ చోరీ?

Chakravarthi Kalyan
ఇటీవల శ్రీలంక అధ్యక్షుడికి వ్యతిరేకంగా భారీ ఆందోళన కొన్ని రోజుల పాటు సాగిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనతో ఏకంగా అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు అధ్యక్షుడు, ప్రధాని నివాసాన్ని ఆక్రమించారు. విచ్చల విడిగా వ్యవహరించారు.

ఆ సమయంలో శ్రీలంక అధ్యక్ష భవనంలో దాదాపు వెయ్యి వరకు కళాఖండాలు మాయమయ్యాయట. ఈ మేరకు తాజాగా పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులు కూడా ఉన్నాయట. ఈ దొంగతనాలపై దర్యాప్తు కోసం ఇప్పుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. అధ్యక్ష భవనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్య వస్తువుల గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవట. అందుకే కచ్చితమైన లెక్కలు తేలడం లేదట. ఈ విషయాన్ని పురావస్తుశాఖ సీనియర్‌ అధికారి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: