సొంత ప్రజలను ట్యాంకులతో బెదిరిస్తున్న చైనా?

Chakravarthi Kalyan
చైనా.. ప్రజాస్వామ్య దేశం కాదు..అక్కడ ఒకటే పార్టీ అధికారంలో ఉంటుంది. అలాంటి చైనాలో అధ్యక్షుడు చెప్పిందే శాసనం. అయితే.. ఇప్పుడు చైనాలో సైన్యం సొంత ప్రజలను యుద్ధ ట్యాంకులను చూపించి బెదిరిస్తోంది. స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు కొన్ని వీడియోలు  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
ఎందుకంటారా.. సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా చైనా యుద్ధ ట్యాంకులను మోహరిస్తోందట. చైనాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. బ్యాంకుల వద్ద భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇటీవల ఈ నిరసనలు తీవ్రమయ్యాయి. వీటిని అణచి వేసేందుకు షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం యుద్ధ ట్యాంకులను బ్యాంకుల వద్ద మోహరిస్తోందట. మరీ అరాచకం కదూ. షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ది బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వద్ద రక్షణగా ఉన్న యుద్ధ ట్యాంకులు ఉన్న వీడియో బాగా చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: