బోర్డర్లో చైనా గ్రామాలు.. ఇండియా చోద్యం చూస్తోందా?

Chakravarthi Kalyan
ఇండియా-చైనా సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచింది. సరిహద్దుల వెంబడి గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తోంది. అయితే.. చైనా చర్యల పట్ల మోడీ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. చైనా... భారత సరిహద్దుల్లో గ్రామాలు నిర్మిస్తున్నా... కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. అంతే కాదు.. డిఫెన్స్ పార్లమెంటరి స్టాండింగ్ కమిటీ లో చర్చ జరపాలన్నా...కేంద్రం అనుమతించ లేదని... అందుకే డిఫెన్స్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు.

మోడీ ప్రభుత్వం దేశ భద్రత పట్ల రాజీ పడొద్దంటున్న కాంగ్రెస్ నేతలు.. కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్ మెంట్ చేయాలని సూచిస్తున్నారు. నాణ్యతా శిక్షణలో రాజీ పడొద్దని.. గత రిక్రూట్ మెంట్ విధానంలోనే కేంద్రం సైనిక రిక్రూట్ మెంట్ చేయాలని.. సూచిస్తున్నారు.  మోడీ హయాంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది... కాబట్టే అగ్నిపథ్ స్కిమ్ లో యువత రిజిస్టర్ చేసుకుంటున్నారంటున్న కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆర్మీ అధికారులు మీడియా ముందుకు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: