హైదరాబాద్‌కు మరో భారీ పరిశ్రమ.. కేటీఆర్ హ్యాపీస్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజన్ ఎంఆర్‌వో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ గ్రూప్ ముందుకొచ్చినట్టు తెలిసింది. దాదాపు 12వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మెయింటెనెన్స్, రిపేర్ , ఓవర్ హాల్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని సాఫ్రాన్ గ్రూప్ వెల్లడించింది. ఇంజన్ టెస్ట్ సెల్ యూనిట్ ను కూడా నెలకొల్పుతారు.

ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ ప్రకటనపై పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.  హైదరాబాద్ లో సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేసే మెగా ఏరో ఇంజన్ ఎంఆర్‌వో ప్రపంచంలోనే పెద్దది. ప్రపంచస్థాయి సంస్థ భారత్ లో ఏర్పాటు చేయబోయే.. మొదటి ఇంజన్ మెగా ఏరో ఇంజన్ ఎంఆర్‌వో ఇదేనని కేటీఆర్ సోషల్ మీడియాలో తెలిపారు.

ఈ యూనిట్ ద్వారా 800 నుంచి వెయ్యి మంది నిపుణులైనవారికి ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక ఏరోస్పేస్, ఏవియేషన్ ఎకోసిస్టంపై మెగా ఏరో ఇంజన్ ఎంఆర్‌వో ప్రాజెక్టు ప్రభావం.. చాలా ఉంటుంది.  సాఫ్రాన్ పెట్టుబడితో హైదరాబాద్ దేశంలోనే మోస్ట్ వైబ్రెంట్, హాపెనింగ్ ఏరోస్పేస్ వ్యాలీగా నిలిచిందని కేటీఆర్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: