ఉక్రెయిన్‌ యుద్ధం: అయ్యో భారత్‌కు ఇంత నష్టమా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం మన ఇండియాపైనా పడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షల ప్రభావం ఇండియన్‌ సంస్థలనూ తాకింది. ఎందుకంటే.. రష్యా కంపెనీల్లో వాటాలు ఉన్న భారత చమురు సంస్థలపై ఈ ఆంక్షలు ప్రభావం చూపాయి. భారతీయ కంపెనీలకు రావాల్సిన డివిడెండ్లు ఈ ఆంక్షల కారణంగా నిలిచిపోయాయి.
ఆ సంస్థలు ఏంటంటే.. ఆయిల్  ఇండియా, ఇండియన్ ఆయిల్ , భారత్  పెట్రోలియం కార్పొరేషన్  కన్సార్టియం మొదలైనవి.. రష్యాకు చెందిన వ్యాంకోర్ నెఫ్ట్  చమురు ప్రాజెక్టులో 23.9శాతం, టాస్ -యుర్ యాక్  ఆయిల్  ఫీల్డ్ లో 29.9శాతం ఈ సంస్థలకు వాటాలు ఉన్నాయి. భారత కంపెనీలకు డివిడెంట్ల రూపంలో 975 కోట్ల వరకూ రావాల్సి ఉంది. అయితే..  ఆంక్షల కారణంగా ఆ సొమ్మంతా రష్యా బ్యాంకుల్లోనే ఉండిపోయింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యా బ్యాంకులను బహిష్కరించటం వల్ల ఇలా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: