8 ఏళ్లు.. 100 లక్షల కోట్లు.. ఇదీ మోదీ లెక్క?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో కేసీఆర్‌ సర్కారుపై మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఎనిమిదేళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పుచేసిన మోదీ... రేపు ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారు చేసిపెట్టారని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. 4 వేల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ.. రూ.11 లక్షల కోట్ల రూపాయలు కార్పోరేట్ అప్పులను మాఫీ చేశారని మంత్రి నిరంజ న్‌రెడ్డి విమర్శించారు. మీ హయాంలో దేశంలో ఎక్కడా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదన్న మంత్రి నిరంజన్‌రెడ్డి..దేశ రైతుల ఉసురు పోసుకుని క్షమాపణలు చెప్పిన విఫల ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. గుజరాత్‌లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా... రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి కూడా మోదీ గుజరాత్‌లో కనీసం 24 గంటల కరంటు ఇవ్వలేకపోయారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: