ఓఆర్‌ఆర్‌ బాధితుల కోసం గళమెత్తిన రేవంత్ రెడ్డి?

Chakravarthi Kalyan
తెలంగాణ సర్కారు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపడుతోంది. ఇందు కోసం భూసేకరణకు ప్రయత్నిస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. కుడా.. ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ భూసేకరణలో రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాల కల్పనకు విముఖం కాదని గుర్తు చేశారు.

కానీ వరంగల్‌ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని.. ఓఆర్ఆర్ కోసం కూడా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517  ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఫలితంగా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడతారని.. ఇందులో అధిక శాతం మంది రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.

ఇలాంటి చిన్నకారు రైతులకు ఆ పొలాలే ఆధారమని... రెక్కల కష్టంతో ఆ పొలాలను సాగు చేసుకుంటే వచ్చే ఆదాయమే వారి దిక్కు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో నోటి కాడి ముద్దను లాక్కుంటే వారు ఎలా బతకాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు. ఇటీవల ఆయా ప్రాంతాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో రైతులు తన ముందు వారు తమ గోడును వెళ్లబోసుకున్నారంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న అందరూ పేదరికంలో మగ్గుతున్న చిన్న, సన్నకారు రైతులేనని గుర్తు చేశారు.

ఆ రైతులు వయసులో పెద్దవాళ్లని..  రెక్కల కష్టంతో బతుకు బండి లాగిస్తున్నారని.. ఇన్నాళ్లూ రైతుగా గౌరవంగా బతికిన వాళ్లు ఇప్పుడు తమ పోషణ కోసం ఏ పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. . పొలం పోతే ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే వారికి చదువు లేదని.. వయసు సహకరించదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భరోసా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: