ఇదేం పని జగనూ..? జనసేన్ ఫైర్‌?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ వైఖరిపై జనసేన గుంటూరు జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదంటున్నారు. జగన్ మాటలు ముఖ్యమంత్రి పదవికి ఆ మాటలు వన్నె తెచ్చేలా లేవని గుంటూరు జిల్లా జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడేళ్ల తర్వాత బయటకొచ్చి  అసహనంతో జనసేనాని పవన్ కల్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేయడం తగదంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఎన్ని మార్కులేస్తారో ప్రజలను అడగాలని జనసేన గుంటూరు జిల్లా నేతలు కోరారు. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఆస్తులు ఎన్నో ప్రజలకు వివరించాలని జనసేన గుంటూరు జిల్లా నేతలు ముఖ్యమంత్రిని కోరారు.

మహిళలపై అత్యాచారాలు, పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలతో అల్లాడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పట్టడం లేదని జనసేన గుంటూరు జిల్లా నేతలు ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు మాని పరిపాలనపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని జనసేన గుంటూరు జిల్లా నేతలు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: