ఆ విషయంలో పుకార్లు నమ్మొద్దంటున్న తెలంగాణ మంత్రి?

Chakravarthi Kalyan
తెలంగాణలో ధాన్యం సేకరణ సజావుగా, రైతులకు సంతప్తికరంగా కొనసాగుతుందని.. రైతులు పుకార్లు, గాలి మాటలు నమ్మొద్దని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ పురోగతిపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉప కమిషనర్ రుక్మిణి, పౌరసరపరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల కొరత, రవాణ, తరుగు వంటి క్షేత్రస్థాయి ఇబ్బందులు, అధికారుల పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 వేల కోట్ల నష్టానికి వెరవకుండా సకల ఏర్పాట్ల చేసి కొనుగోళ్లు చేస్తున్నారని గంగుల కమలాకర్‌ తెలిపారు. తెలంగాణలో గన్నీ సంచుల కొరత లేనేలేదని.. 8.85 కోట్ల గన్నీలకుగాను 2.5 కోట్లు వాడామని.. ఇంకా 25 లక్షల మెట్రిక్ టన్నులకు సరిపడా 6.35 కోట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి  గంగుల కమలాకర్‌ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: