విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఆ ప్లాట్లకు వేలం?

Chakravarthi Kalyan
జగన్ సర్కారు విశాఖలో ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లు సిద్దం అవుతున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 ఆఖరు తేదీగా విఎంఆర్డీఎ మెట్రోపాలిటన్ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున తెలిపారు. లాటరీ ద్వారా ప్రభుత్వోద్యోగులు, పింఛన్ దార్లులకు ఈ ప్లాట్లు కేటాయిస్తారు. వారి వారి కోటా ప్రకారం ముందుగా కేటాయింపులు చేస్తారు. ఆ తర్వాత జనరల్ కేటగిరి పూల్ లో లాటరీ తీస్తారు. విశాఖ జిల్లాలో పాలవలస, రామవరం, జిఎస్ ఆగ్రహారం1,2 లలో మొత్తం 302.21 ఎకరాలలో ఈ ప్లాట్లు ఉన్నాయి.  మొత్తం 2311 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని రూ. 151 కోట్ల తో అభివృద్ది చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో రఘుమండ, జియ్యన్నవలస లలో 34.77 ఎకరాలలో 17.38 కోట్లతో 439 ప్లాట్ల అభివృద్ది చేస్తున్నారు. 150, 200, 240 గజాల విస్తీర్ణంలో నివాసిత స్ధలాల రూపకల్పన చేస్తున్నారు. ఇవన్నీ ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా సిద్దం చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒక ప్లాట్ మాత్రమే ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: