రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై మోదీ షాకింగ్‌ కామెంట్‌?

Chakravarthi Kalyan

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ యుద్ధంలో ఏ దేశమూ విజయం సాధించలేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విజేతలంటూ ఎవరూ  ఉండని ఈ రణంలో చివరకు మిగిలేది పెను విషాదం, విధ్వంసం మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. కానీ ఈ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల కలిగే కష్టనష్టాలను మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోందని ప్రధాని మోదీ ఆవేదనగా చెప్పారు. ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం..  అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని మోదీ తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు తక్షణమే వైరాన్ని వీడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. పరస్పర దాడుల వల్ల కలుగుతున్న ప్రాణ నష్టం, ఆస్తుల విధ్వంసం దారుణమని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాలు శాంతి సామరస్యాలను పాటిస్తూ పరస్పర చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. రష్యా,ఉక్రెయిన్‌లకు దేశాలకు భారత్‌ తొలి నుంచీ చెబుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: