హైదరాబాద్‌ వాళ్లకు గుడ్‌న్యూస్.. ఆ జీవో వచ్చేసింది?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో బతకాలంటే ఇప్పుడు కనీసం నెలకు పాతికవేలైనా సంపాదించాల్సిందే. పెళ్లై సంసారం ఉండే ఈ జీతంతో సంసార సముద్రం ఈదాల్సిందే. అత్యవసర ఖర్చులు పోను ఇప్పుడు సగటు హైదరాబాదీని భయపెడుతున్నది వైద్యమే. ఏదైనా సమస్య వచ్చి ఆసుపత్రికి వెళ్తే ఖర్చు వేలల్లోనే అవుతోంది. అలాంటి సగటు హైదరాబాదీకి ఇది శుభవార్. తెలంగాణ ప్రభుత్వం రూ. 2,679 కోట్లతో హైదరాబాద్ నగరంలో నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించబోతోంది.
ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కూడా ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. ఇక సర్కారీ వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: