పాక్ కొత్త ప్రధాని ప్రతిపాదన.. మోదీ ఏమంటారో?

Chakravarthi Kalyan
పాకిస్తాన్‌కు ఇటీవల కొత్త ప్రధాని వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనే షెహబాజ్‌ షరీఫ్. ఆయన ప్రధాని అయ్యాక తొలిసారి పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ కాశ్మీర్‌ గురించి మాట్లాడారు.. కాశ్మీరీలకు అండగా నిలుస్తామన్నారు. ఇది ఇండియాకు కోపం తెప్పించింది.  అయితే తాజాగా పాక్ కొత్త ప్రధాని శాంతి మంత్రం జరిస్తూ మన ప్రధాని మోడీకి లేఖ రాశారు. భారత్ తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. కాశ్మీర్ సహా అపరిష్క్రతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనేక సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు.

ఇటీవలే షెబబాజ్‌ పాక్ ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ ఆయనకు లేఖ రాశారు. అభినందనలు తెలపారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. చర్చలకు వీలుగా తగిన వాతావరణం కల్పించారని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన పాక్ ప్రధాని తాము కూడా శాంతి సహకారాన్ని పెంపొందిచుకోవాలనుకుంటున్నట్టు తిరుగు సందేశం పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: