వారంలో జమ్మూకాశ్మీర్‌కు మోదీ.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారం రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించబోతున్నారు. ఈనెల 24న ప్రధాని మోదీ.. జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తారు. ఎందుకు అనుకుంటున్నారా.. జాతీయ పంచాయతీ దినోత్సవా‌ని ఈ సారి మోదీ జమ్మూ కాశ్మీర్‌లో జరపనున్నారు. అందుకే  ఈనెల 24న సాంబ జిల్లాలోని పల్లి గ్రామానికి మోదీ వెళ్లబోతున్నారు. అక్కడ నిర్వహించే సభలో మోదీ ప్రసంగిస్తారు. మోడీ ప్రసంగించే ఈ సభకు జమ్ము కాశ్మీర్‌లోని 30వేలకు పైగా పంచాయతీ సభ్యులు హాజరవుతారట.
మరి ఇంతకీ ఈ పల్లి గ్రామం ప్రత్యేకత ఏంటి.. ఎందుకు మోడీ అక్కడికే వెళ్తున్నారు.. దీనికీ ఓ కథ ఉంది. జమ్మూ కాశ్మీర్‌ లోనే మెుట్టమెుదటి కర్భన రహిత సోలార్ పంచాయతీగా పల్లి గ్రామం కీర్తి సంపాదించింది. అందుకే మోడీ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇక  ప్రధాని పర్యటన సందర్భంగా కథువా జిల్లాలో భద్రతను పోలీసులు సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: