వీహెచ్‌ పై దాడి.. రేవంత్ రెడ్డి వార్నింగ్?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ నేత వీహెచ్‌ పై దాడి జరిగిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ ఇంటిపై దుండుగల దాడిని రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన తీరును వీహెచ్‌తో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న రేవంత్... వీహెచ్‌పై దాడి ఘటనలో దోషులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వీహెచ్‌ ప్రజల మనిషని, ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వీహెచ్ లాంటి వ్యక్తి ఇంటిపై దాడి జరగడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులకు మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే సహించేది లేదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనల్లో  దోషులపై కఠినంగా శిక్షించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: