బ్రేకింగ్ : ఎయిర్‌ఫోర్ట్‌పై డ్రోన్ దాడి.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
యునైటేడ్ అర‌బ్ ఎమిరేట్స్ రాజ‌ధాని అయిన‌టువంటి అబుదాబిలోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ఫోర్ట్‌పై డ్రోన్ దాడి ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. ముఖ్యంగా డ్రోన్ దాడుల‌కు త‌మ ప‌నే అని ఇరాన్ మ‌ద్ద‌తు ఉన్న హౌతీ ఉగ్ర‌వాదులు ఒక ప్ర‌క‌టన‌లో వెల్ల‌డించారు. అయితే ఈ డ్రోన్ దాడిలో మూలు ఆయిల్ ట్యాంక‌ర్లు పేలిపోయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అబుదాబి ఎయిర్‌ఫోర్ట్‌లోని ఇంధ‌నం వాహ‌క ట్యాంక‌ర్లు ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం.
2019 సెప్టెంబ‌ర్ 14న సౌదీ అరేబియాలోని రెండు కీల‌క చ‌మురు స్థావ‌రాల‌పై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగు బాటుదారులు అప్పుడు దాడులు  నిర్వ‌హించారు. ఈ దాడుల ఫ‌లితంగా పెర్షియ‌న్ గ‌ల్ప్‌లో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. తాజాగా ఈ దాడుల‌లో మూడు చ‌మురు ట్యాంక‌ర్లు పేలిపోయిన‌ట్టు అధికారులు చెప్పారు. ముఖ్యంగా యూఏఈ  నూత‌న విమానాశ్ర‌యం నిర్మాణ స్థ‌లంలోనే ఒక్క‌సారిగా ఈ మంట‌లు సంభ‌వించిన‌ట్టు అబుదాబీ పోలీసులు వెల్ల‌డించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: