టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై..

Purushottham Vinay
సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు ఊహించని విధంగా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. ఇక టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ.ఇక ఇప్పటికే వన్డే ఇంకా అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఇక టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఓ శకం ముగిసినట్టైంది...2014 వ సంవత్సరంలో ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ ఇక గత ఐదేళ్లుగా భారత జట్టును ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలిపడం జరిగింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న భారత టెస్టు జట్టు ఇక అలాగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్‌కి కూడా అర్హత సాధించింది...

ఇక టోటల్ గా 68 టెస్టు మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కింగ్ విరాట్ కోహ్లీ,మొత్తం 40 విజయాలు అందించి ఇక అలాగే అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ల లిస్ట్ లో టాప్ 4లో ఉన్న విరాట్ కోహ్లీ ఇక మరో టెస్టు విజయాన్ని అందుకుని ఉంటే ఇక టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చేవాడు...ఆస్ట్రేలియా టూర్ ఇంకా అలాగే ఇంగ్లాండ్ టూర్‌లో అదిరిపోయే విజయాలు అందుకుని అబ్బురపరిచిన విరాట్ కోహ్లీ ఇక సడెన్‌గా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం అతని ఫ్యాన్స్ తో పాటు అందర్నీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

 

https://twitter.com/imVkohli/status/1482340422987169794?t=4bNWC-PnozO4n7LK38FYbQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: