రేపు అమిత్‌షాతో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. గ‌త రెండు రోజుల కింద‌నే అమిత్ షా అపాయింట్‌మెంట్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కుమార్ కోరారు. అయితే అమిత్‌షా ఆఫీస్ నుంచి తాజాగా బండి సంజ‌య్‌కు ఫోన్ వ‌చ్చింద‌ని.. డిసెంబ‌ర్ 09న ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ అందుబాటులో ఉండాల‌ని స‌మాచారం.
అయితే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో స‌హా న‌లుగురు ఎంపీలు క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుల‌తో పాటు గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌లను అమిత్ షా వ‌ద్ద‌కు తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి త‌రుణ్ చుగ్ తీసుకెళ్ల‌నున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెల‌కొన్న ధాన్యం కొనుగోలు విష‌యం ర‌గ‌డ‌.. రెండ‌వ విడుత ప్ర‌జా సంగ్రామ యాత్ర‌, రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయాలు, రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: