ఓటీఎస్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

N ANJANEYULU
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని  జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం విధిత‌మే. ఈ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల నుంచి నాటి రుణాలను వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో చెల్లిస్తే లబ్ధిదారులకు ఇంటిపై హక్కు పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించిన‌ది. ఈ ఓటీపీ పై ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం రగడ న‌డుస్తూనే ఉన్న‌ది.
తాజాగా విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి పై మంత్రి అవంతి శ్రీ‌నివాస్ స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి అవంతి. అదేవిధంగా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇండ్ల ప‌ట్టాలు ఇచ్చామ‌ని గుర్తు చేసారు.
ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగానే ముందుకొచ్చి  కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని  చెప్పారు మంత్రి అవంతి. ఓటీఎస్ కట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపి వేస్తారనే ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేసారు. సంక్షేమ పథకాలను మింగుడుపడని కొందరు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారని, ఓటీఎస్ పై రాజకీయాలు చేయడం సరికాదని  మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌ హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: