వెల "సిరి" : తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డేలా సిరివెన్నెల క‌లానికి ప‌దును : మంత్రి పేర్నినాని

N ANJANEYULU
ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌రుపున మంత్రి పేర్నినాని ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. అంత్య‌క్రియ‌లు జ‌రిగేంత వ‌ర‌కు అక్క‌డే ఉండ‌నున్నారు. మంత్రి అంత్య‌క్రియల బాధ్య‌త‌ను సీఎం జ‌గ‌న్‌ పేర్ని నాని ప్ర‌భుత్వం త‌రుపున పంపించారు.  56 అక్ష‌రాల‌ను ఎన్ని ర‌కాలుగా అమ‌రిచారు. సిరివెన్నెల లాంటి పాట‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తాయా అనే ఆవేద‌న సినీ ప్ర‌ముఖుల్లో క‌నిపిస్తుంది.
తెలుగు అక్ష‌రాలు 56 అయితే.. 56 అక్ష‌రాల‌ను ప‌ద విన్యాసంతో కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ మీద‌నే కాకుండా తెలుగు నేర్పిన ప్ర‌తి తెలుగు వాడి మ‌దిలో ముద్ర‌ను  ముద్రించుకుని  ముందుకెళ్లిన మ‌హానీయులు సీతారామశాస్త్రి అని ఆయ‌న గురించి అద్భుతంగా మాట్లాడారు. 56 అక్ష‌రాల‌ను ఎన్ని ర‌కాలుగా అమ‌రిచారు అని పేర్కొన్నారు.  తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డేలాగా త‌న క‌లాన్ని ప‌దును పెట్టిన గీత ర‌చ‌యిత సిరివెన్నెల‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించేందుకు త‌న‌ను ప్ర‌భుత్వం త‌రుపున పంపార‌ని,  ఆయ‌న కుటుంబానికి అండ‌గా ఉండేందుకు తాను ప్ర‌భుత్వం త‌రుపున ప్రార్తిస్తున్నాను అని ప్ర‌క‌టించారు ఏపీ మంత్రి పేర్నినాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: