రేపు క‌డ‌ప జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురువారం క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అక‌స్మాత్తుగా కురిసిన వ‌ర్షాల‌కు పింఛా, అన్న‌మ‌య్య రిజ‌ర్వాయ‌ర్ల‌కు గండి ప‌డి క‌డ‌ప జిల్లాకు ప్రాణ‌, ఆస్తిన‌ష్టం తీసుకొచ్చిన విష‌యం విధిత‌మే. సీఎం జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పరిశీలిస్తార‌ని.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. నవంబ‌ర్ నెల 20న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలు అయిన చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు, అనంత‌పురం జిల్లాల‌లో ఏరియ‌ల్ స‌ర్వే కూడా నిర్వ‌హించారు సీఎం.
ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ బాధితుల‌ను నేరుగా క‌లిసి ప‌రామ‌ర్శించ‌క‌పోవడం విమ‌ర్శ‌ల‌కు తావు ఇచ్చింది. దీనిపై ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నారు. ఇంత‌లోనే ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలో వ‌ర‌ద స‌హాయం తీరుపై నిర్వాసితుల నుండి తీవ్రంగా వ్య‌తిరేక‌త ఆరంభ‌మైంది. రాయ‌చోటి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌జ్జ‌ల‌ను బాధితులు నిల‌దీసారు. వ‌ర‌ద సాయం అందాకే తాను ప‌ర్య‌టిస్తాను అని చెప్పి ముఖ్య‌మంత్రి గురువారం బాధితుల‌ను నేరుగా క‌లుసుకోవ‌డానికి వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: