భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్..

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్‌ను ఇప్ప‌టికే  భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేసాయి. మరొక‌సారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ జారీ చేసిన‌ హెచ్చరికలు తాజాగా కలవరపెడుతున్నాయి.. దీంతో వెంట‌నే అప్రమత్తమైన‌ది ఏపీ ప్ర‌భుత్వం.  ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండనున్న‌డంతో ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో  సీఎం వైఎస్‌ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి సిద్ధం అయ్యారు.
మ‌రోవైపు ఇప్ప‌టికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్రబృందం అంచెన వేసిన‌ది. నాలుగు జిల్లాల‌లో భారీ వ‌ర‌ద‌ల త‌రుణంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర‌బృందం ప‌ర్య‌టించింది. తుఫాన్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని అంచెనా వేసే ప‌నిలో ప‌డిపోయిన‌ది. ఇవాళ కాసేప‌ట్లో ఉద‌యం 10.30 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో  సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో భేటీ కానున్న‌ది కేంద్ర‌బృందం. త‌క్ష‌ణ‌మే సాయంగా రూ.1000 కోట్లు ఆర్థిక సాయం చేయాల‌ని ఇదివ‌ర‌కే సీఎం జ‌గ‌న్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: