చ‌లాన్ వేస్తున్నార‌ని.. బైకు త‌గుల‌బెట్టాడు..!

N ANJANEYULU
సాధార‌ణంగా ద్విచ‌క్ర వాహ‌నానికి ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్ విధిస్తే ఏమి చేస్తారు ఎవ‌రైనా చ‌లాన్ చెల్లిస్తారు. లేదా చెల్లించ‌కుండా త‌ప్పించుకుంటూ ఉంటారు. కానీ ఓ వ్య‌క్తి త‌ర‌చూ త‌న బైకుకు చ‌లాన్‌లు విధిస్తున్నారు అని ఆగ్ర‌హంతో తన వాహ‌నాఇకి నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

ఓ వైపు పెట్రోల్ ధ‌ర మోత మోగిపోతుంటే ద్విచ‌క్ర వాహ‌నం బ‌య‌టికి తీయాలంటేనే భ‌య‌మేస్తుందని, మరోవైపు ట్రాఫిక్ చలాన్‌ల‌తో బెంబేలెత్తి పోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. భారీ జ‌రిమానాల‌తో ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు అల్లాడిపోతున్నార‌ని.. ఏదో ఒక్క సంద‌ర్భంలో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసి రోడ్డు మీద‌కు వెళ్లితే.. చ‌లాన్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆ వ్య‌క్తి పోలీసుల‌కు షాక్ ఇచ్చాడు. ట్రాఫిక్ చ‌లాన్ చెల్లించ‌మ‌ని అన్నందుకు కోపంతో త‌న బైకును త‌గుల‌బెట్టేసి నిర‌స‌న వ్య‌క్తం చేసాడు.

ద్విచక్రవాహనంపై చలాన్లు వారం క్రితం వెయ్యి రూపాయలు చెల్లించాన‌ని వాహనాదారుడు వాపోయాడు. అయినా త‌నిఖీల్లో భాగంగా అధికారులు చ‌లాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. కొంత డ‌బ్బు చెల్లించాల‌ని అడిగారు. దీంతో వారం కింద‌టే చ‌లాన్ క‌ట్టాన‌ని, ఎక్క‌డి నుంచి డ‌బ్బులు తేవాలంటే వాహ‌న‌దారులు అస‌హ‌నానికి గురై బైకుకు నిప్పు పెట్టాడు. వెంట‌నే ట్రాఫిక్ పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంట‌లార్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: