బంగారం బాట‌లోనే వెండి ధ‌ర‌.. ఎంతంటే..?

N ANJANEYULU
మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంటుంది.  ఏ వ్యాపారం తగ్గినా కానీ గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం త‌గ్గ‌కుండా  జోరుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తుంది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను ముఖ్యంగా మహిళలు అధికంగా కొనుగోలు చేస్తుంటారు . ఇక తాజాగా శనివారం దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగిన‌ది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.  
దేశ రాజధాని ఢిల్లీలో  ఇవాళ కిలో వెండి ధర 63,100 ఉండగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 63,100 ధ‌ర ప‌లుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,900 ఉంటే, కోల్‌కతాలో రూ.63,100 వద్ద కొనసాగుతున్న‌ది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా..విజయవాడలో రూ.67,900 గా ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.67,900 , మధురైలో రూ.67,900 వద్ద కొనసాగుతోంది. కానీ ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం క‌నిపిస్తుంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొవ‌డం ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: