కులాలవారీగా బీసీ జనగణన.. ఏపీ అసెంబ్లీలో తీర్మాణం

N ANJANEYULU
 
ఇవాళ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా బీసీ కుల‌గ‌ణ‌న గురించి ప్ర‌స్తావించారు. రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి  బీసీ జ‌న‌గ‌ణ‌న జ‌రుగ‌లేదు. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని, దాదాపు 90 ఏండ్ల కింద‌ట కులాల వారిగా జ‌న‌గ‌ణ‌న జ‌రిగింది. స‌మాజంలో కొద్ది మంది మాత్ర‌మే అధికారం ద‌క్కించుకుంటున్నార‌నే భావ‌న ఉంది. ఈ సారి జ‌ర‌గ‌బోయే జ‌నాభా లెక్క‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ కులం గురించి ఒక కాల‌మ్ ద్వారా డేటా సేక‌రించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు కూడా పంపిన‌ట్టు గుర్తుచేసారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం వీటిని తిర‌స్క‌రించిన‌ది. రాష్ట్ర స్థాయిలో ప్ర‌త్యేకంగా జ‌న‌గ‌ణ‌న‌కు ప్ర‌త్యేకంగా ఏమి లేద‌ని చెప్పారు.
ఇప్ప‌టికే రాష్ట్రంలో జ‌న్మ‌భూమి క‌మిటీలు ఎలా ప‌ని చేసాయో గుర్తు చేశాం. కులాల వారిగా జ‌నాభా మ‌దింపు ఎప్పుడూ జ‌ర‌గలేదని గుర్తు చేశారు సీఎం. స‌మాజంలో అంద‌రూ అన్ని ద‌క్కించుకోవాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌ని తెలిపారు. ఓటు వేసినా వేయ‌క‌పోయినా బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని, బీసీలందరూ మ‌న వాళ్లే అని పేర్కొన్నారు. బీసీల కుల‌గ‌ణ‌న చేయాల‌ని తీర్మానం చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంప‌నున్న‌ట్టు చెప్పారు సీఎం జ‌గ‌న్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: