కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీకి ఇటీవ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించి ఫ‌లితాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిన‌దే. అయితే నిన్న చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను ఎన్నుకోవాల్సి ఉండ‌గా.. వైసీపీ, టీడీపీ నేత‌ల వాగ్వాదం మ‌ధ్య ఎన్నిక జ‌ర‌గ‌లేదు ఆర్వో వాయిదా వేశారు. అదేవిధంగా ఇవాళ కూడా వైసీపీ నుంచి గెలిచిన 14 మంది కౌన్సిల‌ర్లు, టీడీపీ నుంచి గెలిచిన 14 మంది కౌన్సిల‌ర్లు, స్వ‌తంత్ర అభ్య‌ర్థి 1, వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, టీడీపీ ఎంపీ కేశినేని నాని లు హాజ‌ర‌య్యారు.
ఎన్నిక‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఆర్వో భావించి దాదాపు 400 మంది పోలీస్ సిబ్బందితో బందో బ‌స్త్ ఏర్పాటు చేసారు. కానీ ఎన్నిక మాత్రం స‌జావుగా జ‌రుగ‌కుండా వాగ్వాదం చోటు చేసుకున్న‌ది. తొలుత వైసీపీ కౌన్సిల‌ర్లు నిర‌స‌న చేప‌ట్టారు. దీంతో వైసీపీ, టీడీపీ కౌన్సిర్లు, నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేత‌లు జై జ‌గ‌న్‌.. జై వైసీపీ.. జై వ‌సంత్ అని నినాదాలు చేప‌డితే.. టీడీపీ శ్రేణులు జై చంద్ర‌బాబు, జై కేశినేనినాని అంటూ నినాదాలు చేసారు. గొడ‌వ నేప‌థ్యంలో స‌జావుగా నిర్వ‌హించ‌లేమ‌ని ఆర్వో మున్సిప‌ల్ ఎన్నిక‌ను వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. టీడీపీ కౌన్సిల‌ర్లు, ఎంపీ కేశినేని నాని మాత్రం అక్క‌డే కూర్చొని ఉన్నారు. వైసీపీ కౌన్సిల‌ర్లు, ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ‌ప్ర‌సాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది ఇలా ఉండ‌గానే.. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. టీడీపీ వేసిన హౌస్‌మోష‌న్ పిటీష‌న్‌  హై కోర్టు  విచార‌ణ చేప‌ట్టింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి  ఇవాళ మ‌ధ్యాహ్నం  2.15 గంట‌ల‌కు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ విజ‌య‌వాడ సీపీ కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.  దీంతో కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుందో కోర్టు తేల్చ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: