స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడులైన విషయం విధిత‌మే. అయితే ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటాలో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి,  క‌డియం శ్రీ‌హ‌రి, ర‌వీంద‌ర్‌రావు, కౌశిక్‌రెడ్డి, బండా ప్ర‌కాశ్‌, వెంక‌ట్రామిరెడ్డిలు ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ త‌రుణంలో ఇవాళ నామినేష‌న్ల‌కు చివ‌రి రోజున ఇప్ప‌టికే టీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ది.
కాంగ్రెస్ దుబ్బాక‌, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నిక‌లలో పోటీ చేయాలా వ‌ద్దా అని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ముఖ్యంగా 12 స్థానాల‌లో బ‌లం అధికంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ బ‌రిలోకి దించుతుంది. మెద‌క్‌లో జ‌గ్గారెడ్డి స‌తీమ‌ణి నిర్మల‌కు, ఖ‌మ్మం నుంచి ఎమ్మెల్సీగా రాయ‌ల్ నాగేశ్వ‌ర్‌కు రేవంత్‌రెడ్డి భీఫామ్ అంద‌జేశారు. న‌ల్ల‌గొండ‌లో ఎవ‌రికీ ఇవ్వాల‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. ఓవైపు ఉత్త‌మ్‌, మ‌రోవైపు కోమ‌టిరెడ్డి, అదేవిధంగా జానారెడ్డిలు ముగ్గురు మూడు వైపుల మ‌ధ్య స‌యోద్య కుద‌ర‌క‌పోవ‌డంతో న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా టికెట్ ఎవ‌రికీ ఇవ్వాల‌నేదానిపై ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: