సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త

N ANJANEYULU
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియాను కేసీఆర్ ప్రకటించడం చాలా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌తీ ఒక్కరికీ రూ.25లక్ష‌లు ఎక్స్‌గ్రేషియా  ఇవ్వాల‌ని డిమాండ్ చేసారు కేటీఆర్‌. ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతూనే మ‌రోవైపు బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం పేర్కొంటుంద‌న్నారు. ధాన్యం  ఎప్పుడు కొనుగోలు చేస్తుందో మాత్రం కేంద్ర స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు.
రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు  కేటీఆర్‌.  ధాన్యం కొనుగోలు, మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని వందలాదిమంది రైతులు ఆత్మార్పణం చేసారని తెలిపారు. రైతులు కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిడికి త‌ట్టుకోలేక‌, ఆరోగ్యం స‌రిగ్గా లేక ప్రాణాలు కోల్పోయార‌ని, భార‌త ప్ర‌భుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాల‌ని కేటీఆర్ కోరారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు  రాష్ట్ర పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు కృత‌జ్ఞ‌త ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.  రైతుల కుటుంబాల కోసం కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌దం గొప్ప విష‌య‌మ‌ని మంత్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: