ధాన్యం కొన‌కుంటే రాళ్ల‌తో కొడుతారు : బండి సంజ‌య్

N ANJANEYULU
తుఫాన్ కార‌ణంగా తెలంగాణలో వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని, ఇప్పుడు మొత్తం వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌కుంటే మిమ్మ‌ల్నీ రాళ్ల‌తో కొడ‌తార‌ని ప్ర‌భుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ సూచించారు. రైతుల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు త‌న‌పై దాడులు చేయించార‌ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయ‌కుల‌పై రాళ్ల‌దాడి చేస్తార‌ని వెల్ల‌డించారు.
భారీ వ‌ర్షాలతో చాలా వ‌ర‌కు రైతుల వ‌రి ధాన్యం త‌డిసిపోయింద‌ని చెప్పారు. త‌డిసిన ధాన్యాన్ని తేమ‌శాతంతో సంబంధం లేకుండా ప్ర‌భుత్వం వెంట‌నే కొనుగోలు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసారు బండి సంజ‌య్‌. తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలున్నాయ‌ని, ఆల‌స్యం చేస్తే వరిధాన్యం మొల‌కెత్తే అవ‌కావం ఉంటుంద‌ని తెలిపారు. దీనితో రైతులు చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోతార‌ని వెల్ల‌డించారు. ఇవాళ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రిధాన్యం కొనుగోలు చేయాల‌ని రైతులు సెల్ ట‌వ‌ర్ ఎక్కితే వారిపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడులు చేసారని వెల్ల‌డించారు. నిన్న ఇందిరా పార్కు వ‌ద్ద చేసిన‌ టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నాను అది కేసీఆర్ ధ‌ర్నానా.. లేక ప్ర‌భుత్వ ధ‌ర్నానా అని బండి సంజ‌య్ విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: